Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరేంద్రమోదీ కేబినెట్లో టీడీపీ నుంచి వీరికి ఛాన్స్... జేడీయూ నుంచి ఇద్దరికి?

TDP To Get 4 Ministers and JDU 2 In Modi
Advertisement
  • టీడీపీ నుంచి నలుగురికి మోదీ కేబినెట్లో అవకాశం
  • రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్‌లకు ఛాన్స్?
  • జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్లకు అవకాశం
Advertisement
నరేంద్రమోదీ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో తెలుగుదేశం పార్టీకి నాలుగు, జేడీయూకు రెండు బెర్త్‌లు దక్కనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మోదీ కేబినెట్లో టీడీపీ నుంచి ఎంపికయ్యే నలుగురిలో రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్‌లకు చోటు ఉండవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. లలన్ సింగ్ ముంగేర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. భారతరత్న గ్రహీత కర్పూరీ ఠాకూర్ తనయుడే రామ్ నాథ్ ఠాకూర్.

రేపు రాత్రి 7.15 గంటలకు మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై, కేబినెట్ బెర్త్‌లపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 16  లోక్ సభ స్థానాలు గెలుపొందగా నాలుగు మంత్రిత్వ శాఖలు, స్పీకర్ పదవిని కోరింది. 12 సీట్లు గెలిచిన జేడియూ 2 శాఖలు అడిగింది. బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలిచి మేజిక్ ఫిగర్‌కు 32 సీట్ల (272) సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కింగ్ మేకర్లు అయ్యారు.
Advertisement
Advertisement
Narendra Modi
Chandrababu
Lok Sabha Election Results
Nitish Kumar

More Telugu News